కాంగ్రెస్ టిక్కెట్ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలి
– స్థానికేతరులకు ఇస్తే ఫలితాలు తారుమారు ఖాయం
– జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అమేర్ అబ్దుల్లా
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు అంసెబ్లీ అభ్యర్థిగా ఎన్నికల్లో మైనార్టీ విభాగం నుంచి తనకు అవకాశం కల్పించాలని యూత్ కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అమేర్ అబ్దుల్లా కోరారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ గత వారం తాండూరు అసెంబ్లీ స్థానానికి టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తుచేశారు. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికులకు అవకాశం కల్పించాలన్నారు. స్థానికుల కోటాలో మహారాజ్‌ల కుటుంబం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ పోటీలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాము కూడా సేవ చేశామని, అవకాశం ఉంటే మైనార్టీగా తనకూ కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. స్థానికులకే టిక్కెట్టు కేటాయిస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి సాధించిన గెలుపే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానికులను కాదని స్థానికేతరులకు టిక్కెట్టు ఇస్తే ఫలితాలు తారుమారు కావడం ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి..

