నగరేశ్వరాలయంలో శ్రావణ సందడి
– ఘనంగా సామూహిక కుంకుమార్చన
– వాసవి సంఘం ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సందడి కనిపించింది. వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సంఘం శెట్టి శోభల ఆధ్వర్యంలో దేవాలయంలో వాసవీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సంఘం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్దలతో అమ్మారిని ప్రార్థిస్తూ కుంకుమార్చన పూర్తి చేశారు. అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా ఇటీవల పురాణాలపై మహిళలకు క్విజ్ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలో మొదటి విజేత ముద్దాయి పేట్ సరళ, మహేశ్వరిలకు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ సహాకారం బహుమతులు అందజేశారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్మళ సహాకారంతో భగవద్గీత పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళ భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

