చిరస్మరణీయుడు ఇంద్రారెడ్డి
– కోటబాస్పల్లిలో ఘనంగా జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన నాయకులు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని నాయకులు, అభిమానులు పేర్కొన్నారు. సోమవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి 67 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాగప్ప, రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రిగా, హోం శాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి కార్మికులు, పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన స్పూర్తితోనే ఎంతో మంది నాయకులు ఉద్భవించారని అన్నారు. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు అందకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు ఇంద్రారెడ్డికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు సిటీకేబుల్ మేనేజర్ నారాయణగౌడ్, కొట్రిక కిరణ్, మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప, సైదప్ప, బురన్, జగ్గు, రాము, రవి, కే. రవి, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

