కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..!
– బ్రిడ్జి నిర్మాణంపై విచారణ చేయిస్తాం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కాగ్నానది పరిస్థితిపై పరిశీలన
తాండూరు, దర్శని ప్రతినిధి : గత ప్రభుత్వ పాలకుల కమీషన్ల ఆశకు కాగ్నానది బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురైందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు – కోడంగల్ మార్గంలోని కాగ్నానది కొత్త బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అధికారులతో కలిసి పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్య పాలన వల్ల కాగ్నానది కుంగిపోయిందన్నారు. నది బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడడం విచారకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జిలు, ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని విమర్శించారు.

కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై చూపకపోవడంతోనే మూడేళ్లలోపు కాగ్నానది కుంగిపోయిందని అన్నారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..!