తాండూరుకు చేరిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరుకు చేరిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు
– పోలింగ్ నిర్వహణకు ప్రత్యేక అధికారులు
– ఆర్డీఓ, ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆర్డీఓ, ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం తాండూరు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు, వీవీ ప్యాడ్. లు వచ్చాయి. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో వాటిని భద్ర పరిచారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ, ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో మొత్తం 2,31,145 మంది ఓటర్లు ఉండగా అందులో 1,12,572 మంది పురుషులు, 1,18,567 మంది మహిళలతో పాటు 6 మంది థర్డ్ జెండర్లు ఉన్నారని వెల్లడించారు.

నియోజకవర్గంలో ఎన్నికల కోసం 269 మంది పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 23 రూట్లలో 23 మంది ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం తాండూరుకు 336 ఈవీఎంలు, 376 వీవీ ప్యాడ్ లు వచ్చాయని, వాటిని పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూళ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్ర పరచడం జరిగిందన్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ లో భాగంగా జరిపిన తనీఖీలలో ఇప్పటి వరకు రూ. 19లక్షల 73 వేల నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించడం జరిగిందని, దీనిని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత