పోతే.. పోనీ.. మాకేంటి..?

తాండూరు రాజకీయం వికారాబాద్

పోతే.. పోనీ.. మాకేంటి..?
– పైపులైన్ లీకేజీలపై అశ్రద్ద
– మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
– నీటి కలుషితంలో ప్రజలకు తప్పని ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోతే.. పోనీ.. మాకేంటి అన్నట్లుగా వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ అధికారుల తీరు కనిపిస్తోంది. పట్టణంలో నెలల తరబడి లీకేజీలకు గురైన పైపులైన్‌ మరమ్మత్తులపై అశ్రద్దే.. చీదరించుకునే ఆశ్రద్దను కనబరుస్తున్నారని సర్వత్రా విమర్శలను మూటగట్టుకుంటున్నారు.
kvcs
ప్రత్యేక అధికారుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించాల్సిన అధికారులు నిర్లక్ష్య పాత్రను బహు భేషుగ్గా పోషిస్తున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తాండూరు పట్టణంలో పైపులైన్‌లు లీకేజీలకు గురైనా మరమ్మత్తులపై దృష్టిసారించకపోవడంతో అధికారులకు ఈ కితాబులు తప్పడం లేదు. తాండూరు పట్టణం సెయింట్ మార్క్ స్కూల్ సమీపంలో గత రెండు నెలల క్రితం పైపులైన్ లీకేజీకి గురైంది. తాగునీటి సరఫరా చేసే ప్రతిసారి ఈ పైపులైన్ నుంచి నీరు వృథాగా పారుతోంది. అక్కడే ఓ చిన్నపాటి గుండంలా మారి లీకేజీ నీరు అక్కడే నిలుస్తోంది.

తాగునీటి సరఫరా అనంతరం నిలిచిన నీరు మళ్లీ లీకేజీ ద్వారా పైపులైన్‌లోకి వెళ్లిపోతోంది. కళ్లముందే నీరు కలుషితం అవుతుండగా మరుసటి సారి సరఫరా చేసే సమయంలో ఈ కలుషిత నీరు మళ్లీ ఇండ్లకు సరఫరా అవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీకి గురైంది. ఈ పైపులైన్‌ సరిగ్గా మురుగు కాలువలో ఉంది. మురుగు కాలువలో ఉన్న పైపులైన్‌ నుంచే ప్రజలకు తాగునీరు సరఫరా అవుతోంది. మురుగు కాలువలో ఉన్న పైపులైన్ లీకేజీ కావడంతో మురుగురు నీరు పైపులైన్‌లో చేరి కలుషితం అవుతోంది.

లీకేజీని బాగుచేయండి సార్ అని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ కథనాలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినా.. అధికారులకు తెలిసినా.. పోతే పోనీ.. మాకేంటి అనే చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరును ఎండగట్టినా మాకేం కాదులే అనే విధంగా అధికారులను ఏమనాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక పాలనలో ప్రజలకు అధికారులు ఇచ్చే జవాబుదారి తనం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దనిద్ర వీడి లీకేజీలను సరిచేయాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

వర్షాలు తీవ్ర రూపం..!