తిప్పయ్య ముత్యను దర్శించుకున్న విఠల్ నాయక్

తాండూరు రాజకీయం వికారాబాద్

తిప్పయ్య ముత్యను దర్శించుకున్న విఠల్ నాయక్
– సేడం రాఘవపూర్‌ జాతర ఉత్సవాలలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం సేడం రాఘవపూర్‌లో తిప్పయ్య ముత్యను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్‌ దర్శించుకున్నారు.

శనివారం కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా రాఘవపూర్ లో తిప్పయ్య ముత్య ఆధ్వర్యంలో నిర్వహించే జాతర ఉత్సవాలకు విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిప్పయ్య ముత్యను విఠల్‌ నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు విఠల్ నాయక్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం విఠల్ నాయఠ్ మాట్లాడుతూ జాతర ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. భక్తిశ్రద్ధలతో భగవంతుని కొలవాలని పేర్కొన్నారు. రాఘవపూర్‌లోని ఆశ్రమం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ రాములు హరిచందర్ భక్తులు తదితరులు ఉన్నారు.

తండ్రిని గొడ్డలితో హత్య కొడుకు