సూప‌ర్ కావ్య‌శ్రీ..!

తాండూరు వికారాబాద్

సూప‌ర్ కావ్య‌శ్రీ..!
– ఢీ-13 విన్న‌ర్‌ను స‌న్మానించిన భాష్యం క‌ళాశాల
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఈటీవీ ఢీ-13 విన్న‌ర్ కావ్యశ్రీ‌ని సూప‌ర్ అంటూ తాండూరు భాష్యం జూనియ‌ర్ క‌ళాశాల య‌జ‌మాన్యం అభినందించింది. ప‌ట్ట‌ణంలోని రాఘ‌వేంద్ర కాల‌నీకి లారీ డ్రైవ‌ర్ మ‌హేష్, ప‌ద్మ‌వ‌తిల కూతురు కావ్య‌శ్రీ భాష్యం జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతుంది. ఈటీవీలో ప్ర‌సార‌మైన ఢీ-13లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కావ్య‌శ్రీ ఫైన‌ల్‌కు చేరుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో తాండూరుకు వ‌చ్చిన కావ్య‌శ్రీ‌ని శుక్ర‌వారం భాష్యం క‌ళాశాల‌లో కావ్య‌శ్రీ‌ని ఆమె త‌ల్లిదండ్రుల‌ను ప్రిన్సిప‌ల్ డి.రామ‌కృష్ణ‌, వైస్ ప్రిన్సిప‌ల్ ప‌ర్యాద రామ‌కృష్ణ త‌దిత‌రులు స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి కావ్య‌శ్రీ ఢీ-13లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి టైటిల్‌ను గెల‌వ‌డం స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో ఆమె మ‌రిన్ని రికార్డుల‌ను సాధించాల‌ని అభిలాషించారు. అదేవిధంగా పిల్ల‌ల్లో ఏమైనా ప్ర‌తిభ ఉంటే ప్రోత్స‌హించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు వెంకటరెడ్డి, మల్లిఖార్జున్, అధ్యాపకులు సూర్య, శాంతయ్య, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, భాను ప్రసాద్, నౌశిన్ తదితరులు పాల్గొన్నారు.