అభిమానం.. ఆదర్శమైన వేళ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభిమానం.. ఆదర్శమైన వేళ..!
– జన్మదినం వేడుకల్లో విద్యార్థులకు చేయూత
– పటేల్ ఉమా శంకర్ అభిమానుల సేవ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ పటేల్ ఉమా శంకర్ అభిమానులు, యువజన సంఘం నాయకులు ఆదర్శవంతమైన సేవ కార్యక్రమం నిర్వహించారు.
kvcs
శనివారం పటేల్ ఉమా శంకర్ జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు చేయూత అందించారు. పటేల్ ఉమా శంకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని చంద్రవంచ గ్రామానికి చెందిన శివాజీ యువజన సంఘం సభ్యులు మండలంలోని చంద్రవంచ, చిట్టిగనాపూర్, బెల్కటూర్ గ్రామాలలో స్ధానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా సభ్యులు మాట్లాడుతు శాలువాలు దండలు, టపాసులు కాల్చడం వంటి వృథా ఖర్చులు చేయకుండా విద్యార్థులకు చేయూతను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో పటేల్ ఉమా శంకర్‌ జన్మదినం నిర్వహించడం సేవా సంతృప్తిని కలిగించిందన్నారు. మరోవైపు పటేల్ ఉమా శంకర్ అభిమానులు ఆదర్శవంతమైన సేవా నిరతిని చాటుకోవడాన్ని అందరు అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రవంచ శివాజీ యువజన సంఘం సభ్యులు కుర్వ నర్సింలు, కురువ మల్లేష్, అల్కి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విధుల్లో నిర్లక్ష్యం వహించరాదు