శ్రీ చైతన్య పుస్తకాల దందాపై చర్యలు తీసుకోండి
– తాండూరు ఎంఈఓకు బీసీ జేఏసీ ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల దందాకు పాల్పడుతున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్ కు బీసీ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు.

తాండూరు పట్టణం సాయిపూర్ లోని శ్రీ చైతన్య స్కూల్ యజమాన్యం పట్టణంలోని స్నేహ బుక్ సెంటర్ వెనుక భాగంలో స్కూలుకు సంబంధించి స్టాఫ్ ను ఉంచి స్కూల్ పుస్తకాల విక్రయాలు చె పడుతున్నారని తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలకు పాల్పడుతున్న శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకొ వాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు భాను, సాయి, మహేష్, మనోహర్, సాయి, శ్రీధర్, నవీన్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

