వినాయకుని కృప అందరికి సిద్దించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్


వినాయకుని కృప అందరికి సిద్దించాలి
– తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి
– తాండూరులో గణనాథుల దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయకుని కృప భక్తులతో పాటు ప్రజలందరికి సిద్దించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
kvcs
బుధవారం వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన గణనాథులను మహేందర్ రెడ్డి సందర్శించారు. పట్టణంలో భద్రేశ్వర చౌక్ లో పూజలు నిర్వహించారు. అదేవిధంగా సీతారాంపేట్, గాంధీనగర్, శాంతి నగర్ వినాయక మంటపాలను సందర్శించి.. ఆయా కమిటీలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అందరు పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, రాజు గౌడ్, నర్సింలు, గడ్డలి రవీందర్, మాజీ ఫ్లోర్ లీడర్‌ శోభారాణి, రొంపల్లి సంతోష్, బిర్కట్ రఘు, భగవాన్, శేఖర్, అశోక్, శివ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

గణనాథునికి ఎమ్మెల్యే తొలిపూజలు