ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆపరేషన్‌.. జిల్లా ఆసుపత్రి…!
– పలు విభాగాల మరమ్మత్తులకు దృష్టి
– దవాఖానను సందర్శించిన సబ్ కలెక్టర్
– లీకేజీలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు
– పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రణాళికలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సుమారు 25 ఏండ్ల చరిత్ర కలిగిన తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో లీకేజీలు, మరమ్మత్తులతో ఆవస్థలు ఏర్పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ భాగాలలో భారీగా లీకేజీలు అవుతున్నాయి.

ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్‌లో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఆసుపత్రికి మరమ్మత్తుల ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్, పంచాయతీ రాజ్ ఏఈ నందినిలతో కలిసి జిల్లా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. ఆసుపత్రి పైభాగంలో కూడా తనిఖీలు చేశారు.
kvcs
జిల్లా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగాలలో వర్షపునీరు లీకేజీలకు గురికావడంతో ఇబ్బందులు ఎదరవుతున్నాయని జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ల దృష్టికి వెళ్లింది. ఈ మేరకు ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. లీకేజీలకు గల కారణాలు పరిశీలించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మరమ్మత్తులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ నిధులతో యుద్ద ప్రాతిపదిక ఆపరేషన్ థియేటర్ పైభాగంలో మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. ఆ తరువాత ఓపీ విభాగంలో కూడా లీకేజీలు రాకుండా మరమ్మత్తుల పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆ డేట్‌లో ఏం జరిగింది..!