బీసీ భవన్ కు నిధుల ఘనత ఎమ్యెల్యేదే

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ భవన్ కు నిధుల ఘనత ఎమ్యెల్యేదే
– పైలెట్ రోహిత్ రెడ్డిని సన్మానించిన బీసీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో మొట్ట మొదటిసారి నిర్మించే బీసీ భవన్‌కు నిధులు సాధించిన ఘనత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ నేతలు అంతా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిసి గజమాలతో సత్కరించి.. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరులో నిర్మించే బీపీ భవన్ కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ సహాకారంతో రూ. 2 కోట్లు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. తాండూరులోని బీసీలకు ఇచ్చిన హామిని పైలెట్ రోహిత్ రెడ్డి నిలుపుకున్నారని అన్నారు. బీసీ భవన్ కు నిధులు సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బీసీల తరుపున ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా స్థలాన్ని కూడ కేటాయించి నిర్మాణపనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), సీనియర్ నాయకులు పద్దోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.