షాడో.. కాదు.. సేవకుడు..!
– ఆపద ఏదున్న ముందుండే నాయకుడు
– సామాజిక సేవలో సాటిలేని గుర్తింపు
– బుయ్యనిపై స్థాయి మరిచి విమర్శలు తగదు
– భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : షాడో నాయకుడు కాదు.. అతనో సేవకుడు.. ఆపద ఏదున్న ముందుండేది మా నాయకుడు అని తాండూరు భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ అన్నారు. తాండూరు షాడో ఎమ్మెల్యే అంటూ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిపై యాలాల మండలంకు చెందిన బీఆర్ఎస్ నేత చేసిన వాఖ్యలను పటేల్ కిరణ్ కుమార్ ఖండించారు.

బుయ్యని కుటుంబం ఇప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి రాలేదని, చాల ఏళ్ల క్రితం ప్రజాసేవలో ఉన్నారని అన్నారు. కరోనా సమయంలో ప్రపంచ స్థాయిలో ఆర్బీఓఎల్ ద్వారా సేవలను అందించారని గుర్తుచేశారు. తాజాగా దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనిక దళాల రక్షణకు ప్రతి నెల లక్షల రూపాయిలను నిస్వార్థంగా విరాళాలు అందిస్తున్న ఘనత బుయ్యని కుటుంబానిది అని అన్నారు. అదే యాలాల మండలంకు చెందిన చిన్నారి వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతుంటే తనొక్కడే కాకుండా అందరి ద్వారా చేయూతను అందించి సేవా గుణాన్ని చాటున్నారని అన్నారు.

ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో 70శాతంకు పైగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించి ఆదుకుంఉటన్నారని అన్నారు. అంతేకాకుండా తాండూరు మార్వాడి యువమంచ్‌తో కలిసి ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ద్వారా వికలాంగులకు ఉచితంగా జైపూర్ కాళ్ల అమరిక శిబిరం నిర్వహించి ఎంతో మంది వికలాంగులకు తోడ్పాటు అందించారని అన్నారు. అంతేకుండా లక్షల నగదును అందించారని అన్నారు. ఉత్కర్స్ అనే మరో చిన్నారికి సాయం అందించారని తెలిపారు. సామాజిక సేవలో సాటిలేని గుర్తింపు వారి సొంతమని అన్నారు. తమ వద్దకు ఆపద అంటూ ఎవరొచ్చినా ముందు నిలిచేది ఆయనే అని అన్నారు. అంతటి మంచి మనసున్న బుయ్యని కుటుంబంపై బీఆర్ఎస్ నేతలు షాడో ఎమ్మెల్యే అంటూ వాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. బర్దాష్ కాక బురద జల్లే రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బుయ్యని కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఆ నేతకు లేదని.. మరోసారి నోరు జారోద్దని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి….

