ఆ వాఖ్యలను అపార్థం చేసుకోవద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆ వాఖ్యలను అపార్థం చేసుకోవద్దు..!
– మాటలను వక్రీకరించడం వల్లే అపోహలు
– రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీలపై గౌరవం ఉంది
– కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం) వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తన వాఖ్యలను అపార్ధం చేసుకోరాదని తాండూరు కాంగ్రెస్ నాయకులు అఫ్పూ(నయూం) అన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ విషయంలో అఫ్పూ(నయూం) చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీల కౌన్సిలర్ జావిద్‌ కూడా తీవ్రంగా ఖండించారు. దీనిపై అఫ్పూ(నయూం) స్పందించారు. డ్రగ్స్‌ విషయంపై మాట్లాడుతూ రాజీవ్‌, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీలో పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితులను మాత్రమే వివరించడం జరిగిందన్నారు. ఈ వాఖ్యలను కొందరు వక్రీకరించే కుట్ర చేయడం వల్లే అపోహలు ఏర్పడ్డాయని అన్నారు. రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీలపై తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు.

కాలనీల సంక్షేమం కోసం తాను కూడా కృషి చేయడం జరిగిందని గుర్తుచేశారు. తన వాఖ్యలను ఎవ్వరు ఆపార్థం చేసుకోవద్దని కోరారు. పదేళ్ల క్రితం పరిస్థితిని మాత్రమే వివరించారని తెలిపారు. కాలనీలపై తనకు చెడు అభిప్రాయం లేదని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డిల సహాకారంతో వార్డు అభివృద్ధి, సంక్షేమానికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.

రాజీవ్‌ కాలనీపై రాజకీయాలా..?