
గురువులంతా దైవ సమానులు..!
– సమాజాభివృద్ధిలో కృషి ఎనలేనిది
– మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే
– విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : గురువులు అంతా అందరికి దైవ సమానులని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు అభివర్ణించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగా టీచర్స్ డే జరుపుకున్నారు.

శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని బాలాజీ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు శేరి సుధాకర్ రెడ్డి(మాజీ మండల విద్యాధికారి), తాండూరు మండలం నుంచి మృత్యుంజయ స్వామి, యాలాల మండలం నుంచి మాధురి, మోగులయ్య, బషీరాబాద్ మండలం నుంచి పాండప్ప, పెద్దేముల్ మండలం నుంచి సరితలను సన్మానించారు.

అదేవిధంగా మార్వాడి సమాజంకు చెందిన ఉత్తమ విద్యార్థులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా మార్వాడీ యువమంచ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఓం ప్రకాష్ సోమాని, జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, పలువురు సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. మంచి సమాజ నిర్మాణంకు కృషి చేస్తున్న గురువులు అంతా దైవంతో సమానమని కొనియాడారు. గురువులపై భక్తిభావంతో ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి సమాజ్ అధ్యక్షులు మురళిధర్ గగ్రాని, జాతీయ సహాయ కార్యదర్శి రోహిత్ అగ్రవాల్, మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రాఠి, తాండూరు శాఖ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు నిహార్ సోమాని, అభిషేక్ సార్డా, సమాజం పెద్దలు, మహిళలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…
