తాండూరు టు గాన్గాపూర్ ఆర్టీసీ బస్సు

తాండూరు రాజకీయం వికారాబాద్


తాండూరు టు గాన్గాపూర్ ఆర్టీసీ బస్సు

– కొత్త సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో నుంచి గాన్గాపూర్ దైవ క్షేత్రానికి బస్సు సర్వీసు ప్రారంభమయ్యింది. శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు.

ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్టీసీ సంస్థ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బస్సులో ఎక్కి మొదటి టిక్కెట్ తీసుకుని కొద్ది సేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఆర్టీసీ సంస్థకు మహిళ సంఘాల ద్వారా కొత్త బస్సులను మంజూరు చేయించి.. అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు.
kvcs
అదేవిధంగా ఆర్టీసీ సంస్థ ఆధాయ మార్గాలను పెంచుకోవడంలో భాగంగా పుణ్య క్షేత్రాలకు బస్సులను నడిపించడం శుభపరిణామం అని అన్నారు. భక్తులు, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు తాండూరు నుంచి గాన్గాపూర్ కు బస్సును నడిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్వీసును భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్‌, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదళి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, నాయకులు సర్దార్ ఖాన్, బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, మసూద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, రాందాస్, పండరి, కోతి గోపాల్, జిలాని, డీపో మేనేజర్ సురేష్ కుమార్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భళా.. బుయ్యని సరళా రెడ్డి..!