రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
– ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ డీఈ వెంకన్న తెలిపారు. తాండూరు మున్సిపల్ పాటు తాండూరు మండలంలోని గౌతాపూర్, కోటబాస్పల్లి, మల్కాపూర్, కరణ్ కోట్, ఓగిపూర్, పెద్దేముల్ మండలం తట్టెపల్లి, మంబాపూర్, ఇందూర్, యాలాల మండలం కోకట్, బాగాయిపల్లి, బంటారం మండలం, కోట్పల్లి మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు. ఆయా మండలాల్లోని 220, 132, 33 కేవీ సబ్ స్టేషన్లలో నిర్వహణ మరమ్మత్తుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, వినియోగదారులు గమనించి సహకరించాలని అన్నారు.

