సీతాఫలం.. తేలిగ్గా తీసుకోవద్దు..!
– గుండెను కొలెస్ట్రాల్ నుంచి కాపాడే శక్తి
– తింటే ఇమ్యూనిటి పవర్ పెరగాల్సిందే
– ఇంకా మరెన్నో ప్రయోజనాలు
దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి ఎలాంటి కల్తీ లేని పండు లబించేది ఏదంటే సీతాఫలం ఒక్కటే అని చెప్పవచ్చు. ప్రతియేడాది శీతాకాలం ముందు ఈ మధురఫలాలు లభిస్తాయి. ప్రస్తుతం సీజన్లో ఈ సీతాఫలాలు సందడి చేస్తూ ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే సీతాఫలం తీసుకోవాలని, ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని నిఫుణులు చెబుతున్నారు. అందుకే సీజన్ సీతాఫలం వదులుకోవద్దనీ… తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు.

సీతాఫలం ఒక రుచికరమైన ఉష్ణమండల పండు. ఈ పండు రుచిలో అద్బుతంగా ఉండటం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం బయట గట్టి ఆకుపచ్చ తొక్కను కలిగి ఉంటుంది. లోపల తెల్లటి, మృదువైన గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు తియ్యగా ఉంటుంది. ఇక సీతాఫలంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, అది మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాత్ర పోషిస్తుంది. సీతాఫలాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండెపోటులను నివారిస్తుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల, మన చర్మం చాలా ఆరోగ్యంగా మారుతుంది. అందువలన, మన ముఖం సహజమైన మెరుపును పొందుతుంది.
ఈ పండులో ఉండే క్యాటచీన్, ఎపిక్యాటచీన్, ఎపిగాలో క్యాటచీన్ లాంటి ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ నివారణకు ఉపకరిస్తాయి. మూత్రాశయం, రొమ్ము, పొట్ట, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో బాగా సహకరిస్తాయి. ఇందులో ఉండే కారెనాయిక్ యాసిడ్ దీర్ఘకాలికంగా ఉండే వాపుల్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

ఇదికూడా చదవండి…

