– ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలి
– బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత
తాండూరు, ఆగస్టు 16 (దర్శిని): ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని బీజేపీ కౌన్సిలర్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత అన్నారు. సోమవారం తాండూరు జిల్లా ఆసుపత్రి పీపీ యూనిట్ లో ఆమె కొవిడ్ రెండో డోస్ టీకా వేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టిందన్నారు. ఉచితంగా అందజేస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్కులుు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.