అయ్యో.. తల్లీ..!
– కడుపులో బిడ్డతో.. కన్నుమూసిన గర్భిణీ
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బందువుల ఆందోళన
– తాండూరు మాత శిశు ఆసుపత్రిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కడుపులో బిడ్డతో పాటు నిండు గర్భిణీ కన్నుమూసింది.. అయ్యే తల్లీ అంటూ బందువుల రోదనలు మిన్నంటాయి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడంగల్ నియోజకవర్గం రావులపల్లికి చెందిన అఖిల(23)ను కర్ణాటక రాష్ట్రం యానగుంది సమీపంలో ఉన్న ఓగ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహాము జరిపించారు. వీరికి ఇదివరకే ఒక పాప ఉంది. అఖిల రెండోసారి కాన్పుకోసం తల్లిగారి ఊరు అయిన రావుల పల్లికి వచ్చింది. ఆదివారం నొప్పులు రావడంతో తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి అఖిలను తీసుకవచ్చారు.

సోమవారం తెల్లవారు జామున అఖిల కడుపులో బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లానని వైద్యులు కుటుంబీకులకు సూచించారు. కొద్ది సేపటికే అఖిల కడుపులో బిడ్డతో పాటు మృతి చెందింది. అయితే అఖిల డెలివరి విషయంలో నిర్లక్ష్యం వహించారని కుటుంభీకులు ఆసుపత్రి వైద్యులతో వాదనకు దిగారు. అఖిల మృతి చెందడం పట్ల ఆందోళన కొనసాగించారు. ఈ సంఘటన ఆసుపత్రిలో ఉద్రిక్తంగా మారింది. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఇదికూడా చదవండి…

