హస్తంలో భస్మాసుర పాలన..!
– రెండేళ్ల తరువాత కాంగ్రెస్ ఖేల్ ఖతం
– సీఎం రేవంత్ రెడ్డి ఎన్నటికి బీజేపీ మనిషే
– అనుమల.. రెడ్డి కాదు.. లాగుల తొండల రెడ్డి
– దమ్ముంటే తాండూరు నర్సింగ్ కాలేజీపై జీవో తీసుకరా
– వికారారాబాద్ జిల్లా తాండూరు రోడ్లో కేటీఆర్ సవాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరు గ్యారెంటీలకు ఆశపడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీతో భస్మాసుర పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అములు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాకా ఫించన్లు ఇవ్వడం లేదని, రైతు బంధు ఇవ్వడం లేదని, యూరియా అందించడం లేదని, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేయడం లేదని అన్నారు. ఆరు గ్యారెంటీలకు ఆశపడి అధికారమిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలను అమలు చేయకుండా అందరిపై భారం మోపేలా భస్మాసుర పాలన చేస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది ఇంకా రెండేళ్లే అని అన్నారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎప్పటికి బీజేపీ మనిషే అని ఆరోపించారు.

దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడిని చౌకీదార్ అని అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడేబాయి అని పిలుస్తున్నారని అన్నారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోవడం ఖాయమన్ని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలే అని విమర్శించారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై నిలదిస్తే లాగులో తొండలిడుస్తా, గుడ్లు పీకుతా, మెడలో పేగులేసుకుంటా అని అంటున్నారని అన్నారు. అందుకే ఆయనను రేవంత్ రెడ్డి అని పిలవడం మానేషా అని.. అనుమల రేవంత్ రెడ్డి అని కాకుండా లాగుల తొండల రెడ్డి అని పిలవడం మొదలు పెట్టానని అన్నారు. సీఎం హోదాలో ఉందాగా ఉండాల్సిన ఆయన మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవరిస్తున్నారని అన్నారు. తాండూరుకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తే కోడంగల్కు లాక్కువెళ్లారని అన్నారు. నీతి నిజాయితి ఉంటే నర్సింగ్ కాలేజీపై జీవో బయటపెట్టాలని సవాల్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రెండేళ్లే ఉంటుందని, ఆ తరువాత ఖేల్ ఖతం అవుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ అభ్యర్థులు, సీనీయర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

