పేద రైతుకు కుటుంబానికి పెద్ద‌క‌ష్టం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పేద రైతుకు కుటుంబానికి పెద్ద‌క‌ష్టం
– ప‌రిహారం రాలేదని ప్రాణం మీద‌కు
– ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కుమారుడు
– అప్ర‌మ‌త్త‌మై కాపాడిన పోలీసులు
– వికారాబాద్ జిల్లా తాండూరులో ఘ‌ట‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌రిహారం కోసం ఓ పేద రైతు కుటుంబం ప్రాణ‌మీద‌కు తెచ్చుకునేంత ఘాతుకానికి య‌త్నించింది. బైపాస్ రోడ్డులో పోతున్న భూమికి నెల‌ల నుంచి ప‌రిహారం అందించ‌లేద‌ని బాధిత కుటుంబంలోని మ‌హిళ రైతు కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌గా అక్క‌డే పోలీసులు అప్ర‌మ‌త్తమై కాపాడారు. బాధిత కుటుంభీకులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.తాండూరు మున్సిప‌ల్ ప‌రిధిలోని సాయిపూర్ కు చెందిన శ్యామ‌మ్మకు భ‌ర్త కొన్నెళ్ల క్రిత‌మే మ‌ర‌ణించాడు. ఆమె త‌న కుమారుడు న‌రేష్‌తో క‌లిసి జీవిస్తుంది. వీరికి యాలాల మండ‌లం కోక‌ట్ గ్రామ శివారు స‌ర్వేనెంబ‌ర్ 61/ఊ/1/2 లో 1-03 ఎక‌రాల భూమి ఉంది. అయితే తాండూరుకు మంజూరైన బైపాస్ రోడ్డు వీరి పొలంలో నుంచి వెళ్లడంతో ఉన్న 1-3 భూమిలో దాదాపు 20 గుంట‌ల భూమి పోయింది. భూమి కోల్పోయినందుకు ప్ర‌భుత్వం రూ. 9ల‌క్ష‌ల ప‌రిహారం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన టోక‌న్ నెంబ‌ర్ 2233022118ను కూడ గ‌త యేడాది మంజూరు చేసింది. ప‌రిహారం మంజూరు కాక‌పోవ‌డంతో పొలంలో జ‌రుగుతున్న రోడ్డు ప‌నుల‌ను శ్యామ‌మ్మ కుమారుడు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ‌త ఏప్రిలో నియోజ‌క‌వ‌ర్గంలోనే పెద్ద దిక్కుగా ఉన్న‌ నేత‌కు బంధువు అయిన మ‌రోనేత మ‌ద్య‌లో ఉండి తాను ప‌రిహారం ఇప్పిస్తాన‌ని హామి ఇచ్చారు. దీనిపై ఒప్పంద అంగీకారం కూడ వ్రాత‌పూర్వకంగా చేసుకున్నారు. దాదాపు 7 నెల‌లు గ‌డుస్తున్నా ప‌రిహారం అందించ‌డంలో అధికారులు, ఒప్పందం చేసిన నేత కూడ స్పందించ‌క‌పోవ‌డమే కాకుండా బెధిరింపుల‌కు, వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని బాధితుడు న‌రేష్ ఆరోపించాడు. ప‌రిహారం అంద‌డంలేద‌ని న‌రేష్ బుధ‌వారం ఉద‌యం సాయిపూర్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. అదే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న పోలీసులు వెంట‌నే యువ‌కుని వ‌ద్ద నుంచి పెట్రోల్ ను లాక్కుని కాపాడారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. తాండూరు నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద హోదాలో ఉన్న నేత బందువు ఒప్పందం చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. దీంతో పాటు బాధిత యువ‌కుడు కావాల‌నే సాయిపూర్‌కు చెందిన పెద్ద‌లు త‌మ‌కు ప‌రిహారం అంద‌కుండా చేస్తున్నార‌ని ఆరోపించాడు. ఎలాగైన త‌మ‌కు ప‌రిహారం ఇప్పించాల‌ని త‌ల్లీ, కుమారుడు కోరుతున్నారు.