మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
– పుష్పగుచ్చం అందించిన కరణం పురుషోత్తంరావు
– సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్మన్ వీఎన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ చీఫ్ విప్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

మంగళవారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి నివాసంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు నియోజకవర్గంకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

టీపీసీసీ ప్రచార కోఆర్డినేటర్ కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, నర్సింలు, మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, సోమనాథ్ గౌడ్, హరిహర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, నియోజకవర్గ సీనీయర్ నాయకులు ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరణం పురుషోత్తంరావు మహేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ మహేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

