గంజాయి సాగుచేస్తే చర్యలు తప్పవు
– బిజ్జారంలో రైతులకు పోలీసులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతులు వ్యవసాయ పోలాల్లో గంజాయి సాగుచేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని తాండూరు పట్టణ ఎస్ఐ గిరి అన్నారు. శుక్రవారం తాండూరు పోలీస్టేషన్ పరిధిలోని తాండూరు మండలం బిజ్జారం గ్రామంలో రైతులకు గంజాయి సాగు నియంత్రణపై అవగాహన కల్పించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ గిరితో పాటు సిబ్బందితో కలిసి పొలాలను పరిశీలించారు. రైతులకు చెందిన కందితో పాటు
ఇతర పంట పొలాల్లో పర్యటించి తనిఖీలు చేశారు. అనంతరం గ్రామ రైతులతో ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి సాగును ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. అక్రమంగా గంజాయిని సాగుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడినా.. వినియోగించిన కూడ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


