అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా ఆర్ఎస్ఎస్ పథ సంచలన్
– పురవీధుల్లో కరసేవకులపై పూలవర్షం
– మార్మోగిన భారత్ మాతాకీ జై నినాదాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆర్ఎస్ఎస్(స్వయం సేవక్ సంఘ్) పథ సంచలన్ అట్టహాసంగా కొనసాగింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం తాండూరు పట్టణంలోని పథ సంచలన్ చేపట్టారు.

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పథ సంచలన్ ప్రారంభమయ్యింది. ప్రత్యేక వాహనంలో భారత మాత చిత్రపటంతో పాటు డాక్టర్ జీ, గురూజీ చిత్రపటాలతో ఊరేగింపు ప్రారంభమయ్యింది.
kvcs
ఊరేగింపు ముందు కరసేవకులు సంప్రదాదాయంగా ముందుకు సాగారు, పురవీధుల్లో కరసేవకుల ర్యాలీపై పలువురు పూల వర్షం కురిపించారు. పట్టణంలోని పురవీధుల్లో ఆర్ఎస్ఎస్ పథసంచలన్ దేశభక్తిని చాటింది. కరసేవలు, ప్రముఖులు, యువకులు భారత్ మాతాజీ కీ జై అంటూ నినాదాలతో మార్మోగించారు.

ఇదికూడా చదవండి…

మృతునికి కుటుంబానికి బుయ్యని భరోసా