సీఎంఆర్ఎఫ్ పేద‌ల‌కు అండ

తాండూరు వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పేద‌ల‌కు అండ
– రూ.4.80 ల‌క్ష‌ల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిరుపేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండ‌గా ఉంటుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణం, తాండూరు మండలం, ధారూర్ మండలాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.4 లక్షల 80 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. తాండూరు పట్టణానికి చెందిన ఇబ్రహీం కి రూ.1 లక్షా, అశోక్ రెడ్డి కి 12 వేలు, తాండూరు మండలం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన శంకరప్పకు రూ.1.50 లక్షలు, రాఘవా చారికి రూ.68 వేలు, థారూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన మంజులకు రూ.1.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఈరోజు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తూ వారికి అండగా నిలబడుతున్నామన్నారు. సిఎంఆర్ఎఫ్ సహాయం కావలసినవారు తన క్యాంప్ కార్యాలయంలో సంప్రదించాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), ఉర్ధూఘ‌ర్ చైర్మ‌న్ అబ్దుల్ ర‌జాక్, టీఆర్ఎస్ నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.