అమృత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి..!
– గొల్లచెరువుపై మొక్కలు నాటి సంరక్షించాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ వాసులకు మంచినీటితో పాటు ఆరోగ్య కరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న అమృత్ 2.0 లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అమృత్ మిత్రలు పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు.

బుధవారం తాండూరు పట్టణం గొల్ల చెరువు కట్టపై అమృత్ మిత్రలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ 2038 సంవత్సరం నాటికి ప్రజలందరికి మంచినీరు అందించడంతో పాటు మొక్కలు నాటి, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే ఉద్దేశంతో అమృత్2.0 పథకాన్ని అమలు చె స్తుందన్నారు. ఇందులో భాగంగా కట్టపై మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అమృత్ మిత్రలపై ఉందన్నారు. కావున అమృత్ లక్షానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, మెప్మా టీఎంసీ రాజేంద్ర ప్రసాద్, కోఆర్డినేటర్ విషాల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మాజీ కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

