పేదల ఆరోగ్యానికి భరోసా..!
– సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యానికి గురై ఆపదలో ఉన్న పేదలకు సిఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తుందనీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి నగరేశ్వర వార్డుకు చెందిన పొసల స్వరూప అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సంప్రదించారు.

దీంతో సిఎంఆర్ఎఫ్ కింద రూ.1,25,000లు మంజూరయ్యాయి. అదేవిధంగా సాయిపూర్ కు చెందిన కుర్వ శ్రీనివాస్ s/o మల్లప్పకు రూ 2,50,000 (రెండు లక్షల యాభై వేలు)ఎల్‌ఓసీలు మంజూరు అయ్యాయి. గురువారం ఎమ్మేల్యే మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి సిఎంఆర్ఎఫ్ భరోసాగా నిలుస్తుందనీ అన్నారు. పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ ధారసింగ్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

