అట్టహాసంగా చెస్ ఛాంపీయన్ షిప్ పోటీలు..!
– చెస్‌లో విద్యార్థులు ఉన్నత ‘ఎత్తు’కు ఎదగాలి
– ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
– తాండూరులో ఘనంగా ముగిసిన చెస్ పోటీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఆర్బీఓఎల్ తరుపున తగిన తోడ్పాటు అందించడం జరుగుతుందని ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్బీఓఎల్. ప్రైవేటు స్కూల్ అసోసియేషన్, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాండూరు చెస్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమానికి ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులను తల్లిదండ్రులు, పాఠశాలల యజహాన్యాలు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల కోసం చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన హిందూ ధార్మిక పరిషత్, స్కూల్స్ అసోసియేషన్ కు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు తోడ్పాటు అందించేందుకు ఆర్బీఓఎల్ సహాకారం అందిస్తుందని అన్నారు.

ఎంఈఓ వెంకటయ్య గౌడ్ చెస్ పోటీలు నిర్వహించి విద్యార్థుల మేధాశక్తి పెంపుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ లు మాట్లాడుతూ వచ్చే ఏడాది ఓపెన్ టూ ఆల్ చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
ఉత్సహాంగా ఛాంపియన్ షిప్
తాండూరు చెస్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలు ఉత్సహాంగా కొనసాగాయి. ఈ పోటీలలో ప్రైవేటు పాఠశాలలకు చెందిన 850 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14, అండర్ -16 వి భాగాలలో పోటీలు నిర్వహించారు. శనివారం జరిగిన ముగింపులో విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్-14 విభాగంలో ఛాంపియన్ షిప్ విన్నర్ గా క్రిత్విక్ (విశ్వ వేధ హైస్కూల్), రన్నర్ గా రాంచరణ్ (కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్), అండర్ 16 విభాగంలో విన్నర్ గా ప్రజ్యోత్ (సేయింట్ మేరీస్ హైస్కూల్), రన్నర్ గా ఓంకార్ (గౌతమి మోడల్ స్కూల్)లు నిలిచారు.

ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి మోహన్ క్రిష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు జసింత, హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ విజయ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ రమేష్, వినోద్ జైన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి, ట్రెస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, స్కూల్స్ సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

