అన్నం వండిందని.. ఆగ్రహం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అన్నం వండిందని.. ఆగ్రహం..!
– కట్టుకున్న భార్యపై కట్టెతో దాడి
– ఆరుసార్లు తలపై బాది దారుణం
– కటకటాల్లోకి కసాయి భర్త.. అత్తామామలు
– అనూష హత్యకేసులో నిందితుల రిమాండ్
– వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాత్రి వండిన అన్నం ఉండగా మళ్లీ అన్నం ఎందుకు వండావని ఆగ్రహంతో కట్టుకున్న భార్యను కట్టెతో దాడి చేశాడు.

గాయాలు మానకముందే మళ్లీ దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. తాండూరు పట్టణం సాయిపూర్‌లో జరిగిన దారుణ ఘటనలో కసాయి భర్తను, అత్తా మామలను పోలీసులు రిమాండుకు తరలించారు. శుక్రవారం పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన బుర్ర పరమేష్‌ తన భార్య అనూష(కల్పన)ను అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతూ.. దాడి చేయడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏడు నెలల క్రితం ప్రేమ వివాహము చేసుకున్న పరమేష్‌, అనూషలు కొన్నాళ్లు అన్నోన్యంగా జీవించారు. అనంతరం అనూషను అదనపు కట్నం తీసుకరావాలని వేధింపులకు పాల్పడ్డారు. దీంతో పరమేష్‌ భార్య అనూషను దాడి చేయడం ప్రారంభించాడు. అయితే సోమవారం అనూష ఉదయం అన్నం వండగా భర్త పరమేష్ నిన్న రాత్రి వండిన అన్నం ఉండగా మళ్లీ ఎందుకు వండినావు అని గొడవపడ్డాడు. శరీరం అంతా గాయాలయ్యాయి ఇది గమనించిన మామ మొగులప్ప కోడలు కల్పనను తీసుకొని ఆమె పుట్టింటి వద్ద సాయిపూర్లో ఆమె తల్లి గారి వద్ద విడిచిపెట్టి వెళ్ళాడు. తల్లి కట్టెల చంద్రమ్మ ఆమెను ఆదిత్య ఆసుపత్రికి తీసుకెళ్లి చూయించింది.

గాయాలు మానకపోవడంతో మళ్లీ ఆమెను ఆదిత్య ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చూయించారు. అనంతరం అనూషను కరన్‌ కోట్ గ్రామంలో ఉండే తనకు వరుసకు కొడుకు అయినా కట్టెల మోహన్ ఇంటికి తీసుకవెళుతుండగా మార్గమధ్యలో ఆమె అల్లుడు బుర్ర పరమేష్ వారిని బాలాజీ ఆసుపత్రికి దగ్గర అడ్డగించి అనూషను నా భార్యను నేనే నా భార్యకు ఆసుపత్రికి చూపిస్తాను అని తన భార్యను వారి వద్ద నుండి విడిపించుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటి వద్దనే ఒక కట్టె తో కల్పన తలపైన ఆరుసార్లు బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె మృతి చెందిన తర్వాత నిందితుడు ఆమెని ఆటోలో వేసుకొని బాలాజీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని నిర్ధారించిన తర్వాత నిందితుడు తప్పించుకొని పరారయ్యాడు. మృతురాలి తల్లి కట్టెల చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం భర్త పరమేష్‌, అత్త లాలమ్మ, మామ మొగులప్ప ముగ్గురుని అదుపులోకి తీసుకుని తాండూరు కోర్టు ముందు వారిని హాజరు పరిచి వారిని పరిగి జైలుకు రిమాండ్ చేసి పంపడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

 

కాలేజీలో ఇద్దరు దొంగలు..!