హస్తం రేసు గుర్రాలు రెడీ…!
– ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ
– ఆ ఒక్క స్థానం మాత్రం సస్పెన్స్
– ఎవరెవరు.. ఎక్కడి నుంచి బరిలో ఉన్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార హస్తం పార్టీలో దూకుడు కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావాహులు ఉవ్విళ్లు ఊరుతున్నారు.

ఈ క్రమంలో హస్తం పార్టీ నుంచి రోజు రోజుకు బరిలో నిలిచే అభ్యర్థులు పెరుగుతున్నారు. తాండూరు నియోజకవర్గంలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల నుంచి జెడ్పీటీసీల స్థానాలకు అవకాశం కల్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ మండలం నుంచి ఎవరెవరు బరిలో నిలుస్తున్నారో.. ఈ జాబితా చూసేయండి మరీ.

యాలాల మండలం ఎంపీపీ స్థానానికి సంగెం గ్రామానికి చెందిన హన్మంతు ముదిరాజ్ పోటీ పడుతున్నారు. ఇక జెడ్పీటీసీ స్థానానికి తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. సంపత్ కుమార్ లేదా ఆయన కుమారుడు డా.విహాసిత్ పోటీకి సిద్దమయ్యారు. వారితో పాటు జిల్లాగ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీగౌడ్, ప్రముఖ న్యాయవాది నర్సింగ్ రావులు ఆశిస్తున్నారు. బషీరాబాద్ ఎంపీపీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కుమారుడు రోహిత్ రావు పోటీ పడుతుండగా జెడ్పీటీసీ స్థానానికి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నవల్గాకు చెందిన అనిల్ కుమార్ గౌడ్ ఉత్సహాం చూపిస్తున్నారు.

తాండూరు మండల ఎంపీపీ స్థానానికి హర్షవర్ధన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డిలు పోటీ చేస్తుండగా.. జెడ్పీటీ స్థానం పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. రవీందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దేముల్ మండలం విషయానికి వస్తే ఎంపీపీ పదవి కోసం ధారాసింగ్ కుమారుడు జాదవ్ నవీన్‌కుమార్, ఓమ్లానాయక్ తాండాకు చెందిన బాబు సింగ్, సుమిత్ర, పెద్దేముల్‌కు చెందిన ప్రభుత్వ టీచర్ మోహన్ సింగ్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. జెడ్పీటీసీ కోసం మళ్లీ ధారాసింగ్ పోటీ చేసే అవకాశాలుఉన్నాయని, లేదంటే మరోకరు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వికారాబాద్ జెడ్పీపీఠం పదవి అభ్యర్థి ఎవరనేది కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ స్థానం అభ్యర్థి విషయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును కొసాగిస్తోంది.

ఇదికూడా చదవండి….

