ఇందిరమ్మ కోసం లొల్లి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇందిరమ్మ కోసం లొల్లి..!
– ఇసుక ఇప్పించాలని లబ్దిదారుల ఆందోళన
– యాలాల తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఇందిరమ్మ లబ్దిదారులు లొల్లి పెట్టారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు తరలివచ్చారు.

కార్యాలయం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం మండలంలో 42 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు స్లాబ్ దశ వరకు నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత ఏర్పడడంతో నిర్మాణాలు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇతర మండలాల్లో ఇదిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక మంజూరు చేస్తున్నారని, ఇక్కడ మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు లబ్దిదారులు చేస్తున్న దర్నావద్దకు తహసీల్దార్ వెంకట స్వామి చేరుకుని మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మండలంలో ఉన్న కాక్రవేణి. కాగ్నానదిలో నుంచి ఇసుక అనుమతులు ఇవ్వకుండా.. బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో నుంచి ఇసుక తరలింపుకు అనుమతులు ఇస్తామని చెప్పడంతో లబ్దిదారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అనుమతులు ఇవ్వకుండా 30 కిలోమీటర్ల దూరం నుంచి ఎలాంటి తెచ్చుకోవాలని ప్రశ్నించారు. మండలంలోనే ఇందిరమ్మ ఇళ్లకు ఇనుక అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వినతిపత్రం అందజేశారు.

ఇదికూడా చదవండి…

ముసాయిదా చర్చ.. రసా భసా..!