ఉత్తమ ఏఈఓగా శెట్టి సౌమ్య
– స్పీకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం
– మరో ఇద్దరికి ఉత్తమ అవార్డులు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంకు చెందిన శెట్టి సౌమ్య ఉత్తమ ఏఈఓగా అవార్డును పొందారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల సమక్షంలో ఉత్తమ అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.

ఇందులో భాగంగా బషీరాబాద్ మండలం నుంచి ఖాసీంపూర్ క్లస్టర్ నుంచి ఉత్తమ వ్యసాయ విస్తీర్ణ అధికారిగా శెట్టి సౌమ్య ఉత్తమ అవార్డును అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు స్పీకర్, కలెక్టర్, ఎమ్మెల్యేలు అభినందించారు. ఆమెకు ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉద్యోగులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. మరోవైపు బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, కంప్యూటర్ ఆపరేటర్ అరుణ్ కుమార్ కు ఉత్తమ అవార్డులు పొందారు.

ఇదికూడా చదవండి…

