విశ్వ వేద వండర్ కిడ్స్..!
– డిస్ట్రిక్ సైన్స్ ఫేయిర్‌లో అద్బుత ప్రతిభ
– ప్రదర్శనలో ఇద్దరికి ప్రథమ బహుమతులు
– త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్‌లో తాండూరులోని విశ్వవేద విద్యార్థులు వండర్ కిడ్స్ అనిపించుకున్నారు. తమలోని ప్రతిభను పదునుపెట్టి తయారు చేసిన ప్రదర్శనలో జిల్లా స్థాయి సైన్స్ పేయిర్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు.

జిల్లా స్థాయిలో పాఠశాలకు ప్రథమ బహుమతులు తీసుకరావడమే కాకుండా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారు. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సంజన గణితానికి సంబంధించిన ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థిని వర్షిత స్టార్చ్ నుండి బయోప్లాస్టిక్ తయారు చేసే విధానాన్ని గురించి ప్రదర్శన ఇచ్చారు.

ఈ ఇద్దరు విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీంతో వారిని రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, బహుమతులు అందించారు. ఈసందర్భంగా విశ్వవేద స్కూల్ యజమాన్యం ఇద్దరు విద్యార్థులతో పాటు ప్రదర్శనలకు తోడ్పాటు అందించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలో కూడా అద్భుత ప్రదర్శనలు ఇచ్చి సత్తా చాటాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

