అనువుగాని చోటంటే.!
– ప్రోటోకాల్ పెట్టిన చిచ్చు
– మంత్రి ముందే గులాబీ నేతల రభస
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మద్య వాగ్వివాదం
– ఫాగింగ్ మిషన్ల పంపిణీలో రసాభసా
– సర్ది చెప్పిన విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అనువుగాని చోట అందలం ఎక్కారని చేసిన వాఖ్యలు టీఆర్ఎస్ పార్టీ నేతల మద్యే చిచ్చు రేగింది. ప్రోటోకాల్ పాటించాలంటూ అధికార పార్టీ నాయకులే వాగ్వివాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో నేతలు కయ్యానికి సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ముందే ఈ ఘర్షణ జరిగింది. మంత్రి పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వాగ్వివాదం చె చేసుకున్నారు. క్రమంగా మరోసారి వర్గ విభేదాలను తలపించే విధంగా మారిన ఈ సంఘటనకు ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమం వేధికైంది.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్యే సురభి వాణిదేవి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాస్త ఆలస్యంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు, అనుచర నాయకులతో కలిసి హాజరయ్యారు. ఏర్పాటు చేసిన వేధికపై ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా హాజరయ్యారు.

మున్సిపల్ వర్సెస్ జీపీ
అనంతరం సభావేధికపై ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తాండూరు మండలం గౌతాపూర్ ఎంపీటీసీ సాయిరెడ్డి, అంతారం సర్పంచ్ రాములు, పెద్దె ముల్ మండల పార్టీ అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్ కుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని గ్రామాలకు సంబంధించిన కార్యక్రమానికి మున్సిపలకు సంబంధించిన వారిని ఎందుకు వేధికపై వచ్చారని అన్నారు.
దీంతో గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాన్ని మున్సిపల్ ఎందుకు ఏర్పాటు చేశారని సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వడ్డె శ్రీనివాస్. టీఆర్ఎస్ ఫ్లోరీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ రత్నమాల నర్సింలు, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డిలతో పాటు నాయకులు వారిపై మండపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న డీఎస్సీ లక్ష్మీనారాయణ ఆదేశాలతో పోలీసులు నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ జోక్యం చేసుకుని నేను వేధికపై వచ్చినందుకే రాద్ధాంతం చేస్తారా.. ఇకపై గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాలను మున్సిపల్ ఎట్టుకోవద్దని.. పెట్టుకుంటే మమ్మల్ని ఆహ్వానించొద్దంటూ మంత్రి ముందు అక్కసు వెలగక్కారు. క్రమంగా ఈ వివాదం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వర్గ భే ధాలంటూ మలుపు తీసుకుంది.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వాగ్వివాదం
వేధికపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వాగ్వివాదం సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు మాటల యుద్ధం జరుగుతుండగా మరోవైపు వేధికపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు వాగ్వివాదం చేసుకోవడం కనిపించింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యప్ప మండిపడ్డారు.
ఇక్కడ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని, ఎవరు చేయమన్నారంటూ అడిషనల్ కలెక్టర్ ను నిలదీశారు. దాదాపు అరగంట పాటు ఈ వివాదం కొనసాగింది.
సర్దిచెప్పిన మంత్రి సబితారెడ్డి
నేతలు వాగ్వివాదం చేసుకుంటూనే ఎమ్మెల్సీ వర్గం నేతలు కార్యక్రమంలో తమను అవమానించారంటూ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సమావేశం వేధిక ముందు నేలపై కూర్చున్నారు.
దీంతో మంత్రి సబితా రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి వివాదం సద్దుమణగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని మంత్రి సబితా రెడ్డి అధికారులను సూచించారు.

