ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక

తాండూరు రాజకీయం

ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక
– పండగను అందరు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్
– వినాయక సూపర్ స్పెషాలిటీలో ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక అని హాస్పిటల్ చైర్మన్ మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ పేర్కొన్నారు.
శుక్రవారం తాండూర్ పట్టణం వినాయక సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో రంజాన్ ఉపవాస దీక్షలు సందర్భంగా ముస్లిం సోదరులకు మరియు డాక్టర్లకు ఇఫ్తార్ విందు నిర్వహించారు.

ఈ ఇప్తార్ విందుకు ముఖ్య అతిధి గా హాస్పిటల్ చైర్మన్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ పండగలో భాగంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామ రస్యతను చాటుతాయ న్నారు .పవిత్ర రంజాన్ పండగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందర్ నాయక్, మరియు డాక్టర్ రాజుతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి