తాండూరులో కాంగ్రెస్ హవా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో కాంగ్రెస్ హవా..!
– బల్దియా పీఠం హస్తగతం..?
– కాంగ్రెస్ కంచుకోటగా సాయిపూర్
– నాలుగింటిలో మూడు క్లీన్ స్వీప్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అత్యథిక స్థానాలను గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోబోతోంది. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించిన కారు మ్యాజిక్ ఫిగర్‌ కంటే తక్కువ స్థానాలకే పరిమితం అయ్యింది.

శుక్రవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్‌ నుంచి బీఆర్ఎస్ పార్టీ దూకుడు కనిపించినా.. రెండో రౌండ్‌, మూడో రౌండ్‌లలో వెనుకబడి పోయింది. తాండూరు పట్టణం సాయిపూర్ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి సాయిపూర్ నుంచే పోటీ చేయగా ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్లాపూర్ శ్రీకాంత్ విజయం సాధించారు. 11వ వార్డులో బంటు వేణుగోపాల్, 12వ వార్డులో పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి సాయిపూర్‌లో క్లీన్ స్వీప్ చేసింది.

అదేవిధంగా పట్టణంలోని 2వ వార్డులో ప్రత్యూష, 3వ వార్డులో సుల్తానా, 4వ వార్డులో మెహర్ ఉన్నీసాభేగం, 14వ వార్డులో మహియా అంజూమ్, 15వ వార్డులో దివిటి ఎల్లప్ప, 16వ వార్డులో నారా శ్రీలత, 17వ వార్డు సనా తబస్సుమ్, 19వ వార్డు జుంటుపల్లి వెంకట్, 21వ వార్డు సభా ఫాతిమా, 22వ వార్డు రామకృష్ణ, 24వ వార్డు బాలకృష్ణారెడ్డి, 26వ వార్డు వైశాలి గౌడ్, 27వ వార్డు స్వరూప మల్లేశం, 29వ వార్డు అబ్దుల్ రజాక్, 30వ వార్డు మెహరాజ్ భేగం, 35వ వార్డు అప్షామైనా భేగంలు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు సాధించి మున్సిపల్‌లో హవా కొనసాగించింది. ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్ చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే చైర్మన్ పీఠాన్ని అధిరోహించబోతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చీ సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 12స్థానాలు, బీజేపీ 3, ఎంఐఎం 1, ఇండిపెండెంట్‌ -1 స్థానాలను సాధించుకున్నాయి.

గెలిచిన అభ్యర్థులు, మెజార్టీ వివరాలు…

హస్తం ఖాతాలో మరో హాట్రిక్ కౌన్సిలర్..!