హ్యాట్రిక్ సర్కారే ధ్యేయం..!
– ఎన్నికల్లో తాండూరు వార్ వన్ సైడే
– తాండూరు నుంచి భారీ మెజార్జీ అందించాలి
– మంత్రిగా తాండూరు అభివృద్ధికి ప్రాధాన్యత
– సమాచార, గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
– మంత్రి, ఎంపీలతో కలిసి తాండూరు అభివృద్ధికి కృషి చేస్తా
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటు చేయడమే అందరి ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టిన మహేందర్ రెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ సాధించుకున్న పైలెట్ రోహిత్ రెడ్డిలతోపాటు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు మొదటి సారి తాండూరుకు విచ్చేసిన సందర్భంగా బీఆర్ఎఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. విలియమూన్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ సమీపం వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో తనపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించారని అన్నారు. రెండో సారి దక్కిన మంత్రి పదవితో తాండూరు ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ప్రాంతంలో ప్రతిపక్షాల నుంచి పోటీ లేదని, వాళ్లకు అభ్యర్థులు కరువయ్యారని అన్నారు. రెండోసారి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వన్ సైడ్ ఓటింగ్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎంపీగా చేవేళ్ల రంజిత్ రెడ్డిలను కూడ గెలిపించాలన్నారు. ఎన్నికల తరువాత గ్రామాల్లో పర్యటించి తాండూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డిలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పార్టీ గెలుపుకోసం పనిచేయాలన్నారు. ఎన్నికల తరువాత ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి, హ్యాట్రిక్ మంత్రిగా మహేందర్ రెడ్డి పదవి పొందడం ఖాయమన్నారు. ఇన్నాళ్లు తనూషా చూసిన ప్రతిపక్షాలకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల కలయికతో భంగపాటు కలిగిందన్నారు. సర్కారు సంక్షేమ పథకాలను వివరించి గెలుపుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధి కోసమే మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి పనిచేయడం జరుగుతుందన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలతో పాటు తన ముగ్గురి కలయికతో ప్రతిపక్షాల గుండెల్లో త్రిశూలంలా దిగిందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటు కోసం తాండూరు నుంచి పునాది వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేసే ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని, తాండూరు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు.
పట్నం, పైలెట్‌లకు బ్రహ్మరథం
పట్టణంలోని విలియమూన్ చౌరస్తా మంచి మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు తాండూరు పార్టీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి ఇందిరా చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ చౌరస్తా సమీపం వరకు వ్యాలీ కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గులాబీ జెండాలతో వారికి స్వాగతం పలికారు. దీంతో ర్యాలీ మార్గం పూర్తిగా గులాబీ మయంగా మారింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(వయూం), మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ఎస్ బలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఇది కూడా చదవండి..

