లక్కీ డ్రాలో బైక్ విన్..!
– బీఎస్ఆర్ చేతుల మీదుగా అందజేత
– చెరువెంటి ఈశ్వారాలయంలో డ్రా
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహా శివరాత్రి సందర్బంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతకు బైకును అందజేశారు.

తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా విజేతకు బహుమతి అందజేశారు. మహాశివరాత్రి పండగను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణం చెరువెంటి ఈశ్వరాలయంలో లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద నిర్వహించిన లక్కీ డ్రాలో తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్కు బైకు వరించింది.

ఈకార్యక్రమానికి హాజరైన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా విజేత పటేల్ కిరణ్ కుమార్కు బైకును అందజేశారు. గెలిచిన బైకును శ్రీనివాస్ రెడ్డి సరదాగా నడిపారు. మరోవైపు లక్కీడ్రాలో బైకును గెలుచుకున్న విజేత కిరణ్ కుమార్కు దేవాలయ కమిటి సభ్యులు అభినందనలు తెలిపారు.


