ట్యాక్స్ రికవరీ టెన్షన్..!
– మొండి బకాయిల వసూళ్లకు వెళ్లిన అధికారులు
– తాండూరు హనుమాన్ చౌల్ట్రీ వద్ద ఉద్రిక్తత
– చివరకు ఏమైందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధికారులు పెండింగ్ ట్యాక్స్ రికవరీ వెళ్లిన వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి తాండూరు మున్సిపల్ అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు రైల్వే స్టేషన్ హనుమాన్ చౌల్ట్రీ దుకాణ సముదాయాలు కొనసాగుతున్నాయి. 2002 ఏడాది నుంచి మున్సిపల్ కు పన్నులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు ఈ దుకాణా సముదాయాలకు సంబంధించి దాదాపు రూ. 9 లక్షల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి మున్సిపల్ అధికారులు ఆస్తిపన్నుల వసూళ్లు చేపడుతున్నారు.
ఈక్రమంలో దుకాణ సముదాయాల పన్నులు చెల్లించాలని అధికారులకు నోటీసులు అందించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బకాయిల వడ్డీపై 90 శాతం రాయితీ కూడా కల్పించింది. దీంతో హనుమాన్ చౌల్ట్రీ దుకాణాలకు దాదాపు రూ. 4 లక్షల వరకు రిబీట్ లభించింది. దీంతో బకాయిలు రాబట్టేందుకు అధికారులు సంబంధిత ఈఓను మున్సిపల్ అధికారులు కోరారు. ఇందుకు ఈఓ రెండు రోజులు గడువు కోరారు. గడువు తీరడంతో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది హనుమాన్ చౌల్ట్రీ వద్దకు చేరుకున్నారు.
అధికారులు ఒకేసారి రావడంతో ఆ ప్రాంతం స్వల్ప ఉద్రిక్తతంగా మారింది. బకాయిల చెల్లింపుకు మరో అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు కోరడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో వారికి చివరి అవకాశం ఇవ్వడం జరిగిందని, బకాయిలు చెల్లించకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్ సిబ్బంది, కృష్ణ, వెంకటయ్య, రమేష్, నాగేందర్, శ్రీనివాస్, నర్మదా, రాములు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

