సీఎం రేవంత్‌ రెడ్డితో తాండూరు నేతలు

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్‌ రెడ్డితో తాండూరు నేతలు
– స్వాగతం పలికిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పుష్పగుచ్చం అందించిన మున్సిపల్‌ చైర్మన్, కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాండూరు నేతలు సందడి చేశారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్ట్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు సంఘటన సృజన్‌ అభియాన్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన శిక్షణ శిబిర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు తరలివెళ్లారు. కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌, కౌన్సిలర్లు ఎమ్మెల్యే బీఎంఆర్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్చం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, డ్రైనేజ్ మరియు రోడ్ల సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా మెరుగుదల వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయి సహాకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా నూతన చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌, కౌన్సిలర్లు అందరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పరిపాలనతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే టి. రాంమెహన్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులు ఉప్పరి మల్లేశం పలువురు నేతలు ఉన్నారు.

పార్టీ బలోపేతంలో కీలకపాత్ర మీదే..!