బుయ్యని మనువడి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

బుయ్యని మనువడి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి
– అట్టహాసంగా విశ్వ ఆద్విక్ జన్మదిన సంబరాలు
– హాజరైన స్పీకర్, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మనుమడు, బుయ్యని శివకుమార్ రెడ్డి–కావ్య దంపతుల కుమారుడు బుయ్యని విశ్వ ఆద్విక్ మొదటి పుట్టినరోజు వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

శుక్రవారం రాత్రి జన్వాడలోని ఆర్య కన్వెన్షన్ లో అట్టహాసంగా విశ్వ ఆద్విక్ జన్మదిన సంబరాలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర రంగాల ప్రముఖులు కూడా హాజరై చిన్నారికి శుభాశీస్సులు అందించారు.

ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,పలువురు మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,రాజకీయ ప్రముఖులు, నాయకులు, అధికారులు, పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు.

పరిశుభ్రత అందరి బాధ్యత