కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం
– ఆకట్టుకున్న నౌకా దళాల ప్రదర్శనలు
– అభినందించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– స్పూర్తి నింపిన విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ హై స్కూల్‌(కేవీసీఎస్) విద్యార్థులు స్పూర్తి నింపారు. గురువారం స్కూల్ ఆధ్వర్యంలో నేవీ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. దేశ రక్షణలో నేవీ దళాలు చేసే ధైర్య సాహాసాలను విద్యార్థులుగా ప్రదర్శనలు ఇచ్చారు.
kvcs
జాతీయ జెండాతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పాఠశాల నుంచి పురవీధుల్లో నేవీ దళాల వేషాధారణతో మార్చ్ ఫాస్ట్ చేస్తూ ముందుకు సాగారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని డీఎస్పీ నర్సింగ్ యాదయ్యకు విద్యార్థులు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ దేశ రక్షణలో నేవీ దళాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వారి సేవలు ఎంతో గర్వకారణమన్నారు.

నేవీ దళాలు అందిస్తున్న సేవలను చాటేందుకు విద్యార్థులు చేస్తున్న కృషిని, ప్రదర్శనలను అభినందించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌లు మాట్లాడుతూ నౌకా దళ సిబ్బంది త్యాగం, దృఢ సంకల్పం, ధైర్య సాహసాలకు దేశం గర్విస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు దేశాన్ని రక్షిస్తూ విపత్తు సమయాల్లో వారందించే సామాజిక సేవలు అజరామరమని ఒక సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మార్మోగిన శరణు గోష..!