‘టాలెంట్’ ఎక్స్‌లెంట్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

టాలెంట్ఎక్స్‌లెంట్..!
– ఒలంపీయాడ్ పరీక్షల్లో ఎస్కేటీఎస్ సత్తా
– రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన 40 మంది విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్కేటీఎస్) విద్యార్థులు తమ టాలెంట్ నిరూపించుకుని ఎక్స్ లెంట్ అనిపించుకున్నారు. అంతర్ రాష్ట్ర వార్షిక ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో స్కూల్ కు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు.

హైదారాబాద్ కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ వారు టీజీ-అభ్యాసోత్సవంలో భాగంగా బషీర్ భాగ్ లోని భారతీయ విద్యా భవన్ లో ఒలంపియాడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు తాండూరు నుంచి సుమారు 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ అంశాలలో జరిగి పోటీలలో 40 మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహకులు మెమెంటో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ఎస్కేటీఎస్ లక్ష్యమని, విద్యార్థుల సాధించిన ర్యాంకులే కృషికి ఫలితం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి….

అంబేద్కర్ స్మరణలో వినాయక ఆసుపత్రి