మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి
– నూతన చైర్మన్ పట్లోళ్ల నర్సింలు
– మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు సన్మానం
– యార్డులో ఉత్సహాంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నూతన చైర్మన్ పట్లోళ్ల నర్సింలు అన్నారు. సోమవారం ఆయన తొలిసారి మార్కెట్ కమిటిని సందర్శించారు.

ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దంపతులను పట్లోళ్ల నర్సింలు ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటి, దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు.

చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌ రెడ్డి, చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, వ్యాపారులు కలిసి యార్డులోని పలు ప్రాంతాలను చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ త్వరలోనే ప్రమాణ స్వీకారం జరుగుతుందని అన్నారు. మార్కెట్ కమిటి అభివృద్ధికి ఎమ్మెల్యే సహాకారంతో తన వంతు నిరంతర కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి కార్యదర్శి, అధికారులు, డైరెక్టర్లు, పలువురు వ్యాపారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్‌పై దండయాత్ర..!