ప‌క‌డ్బందీగా పారిశుధ్ధ్యం

తాండూరు

ప‌క‌డ్బందీగా పారిశుధ్ధ్యం
– మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప‌ట్ట‌ణంలో పారిశుద్ధ్య ప‌నులు ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు దృష్టి సారించ‌డం జ‌రుగుతుంద‌ని తాండూరు మున్సిప‌ల్ మేనేజ‌ర్ బుచ్చిబాబు అన్నారు. గురువారం తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, తాండూరు ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు మేనేజ‌ర్ బుచ్చిబాబు శానిట‌రి ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్‌తో క‌లిసి ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల‌లో ప‌ర్య‌టించారు. ఆయా వార్డులలో చేప‌డుతున్న పారిశుద్ధ్య ప‌నుల‌ను ప‌రిశీలించారు. కార్మికులు విధుల్లో నిర్ల‌క్ష్యం చేయ‌రాద‌న్నారు. చెత్త తొల‌గింపు, మురుగు కాలువ‌ల ప‌రిశుభ్రం ప‌నులు సక్ర‌మంగా చేప‌ట్టాల‌ని కార్మికుల‌ను ఆదేశించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మున్సిప‌ల్ చైర్ ప‌ర్సన్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, ఆర్డీఓ అశోక్ కుమార్ ఆదేశాల మేర‌కు ప‌ట్ట‌ణంలో పారిశుద్ధ్య ప‌నులు ప‌క‌డ్బందీగా చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ జ‌వాన్లు, సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.