శాంతి విలాసంకు ప్రార్థిద్దాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శాంతి విలాసంకు ప్రార్థిద్దాం..!
– పవిత్ర రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి యుద్ద పరిస్థితులు లేకుండా శాంతి విలాసం ఏర్పడేలా అందరు ప్రార్థించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మత పెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆగిపోయి శాంతి సమాధానాలు విలసిల్లాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను ప్రార్థించుకుందాం అని అన్నారు. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని అన్నారు. ఈ మాసంలో ఇచ్చే ఇప్తార్ విందులలో అన్ని వర్గాల మద్య మతసామర్యస్యంతో పాటు సోదరభావం పెంపొందుతుందని అన్నారు. రంజాన్ పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆపదల ‘రూప’ మాపు..!