పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం
– ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం సంగెంకాలన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ సహాకారంతో గ్రామానికి చెందిన మస్తాన్ కు రూ. 44 వేలు, సుభాష్ కు రూ. 38వేలు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరయ్యాయి. అదేవిధంగా ఇందిరానగర్ కౌన్సిలర్ బోయరవి ద్వారా కాలనిలో బాలమణికి రూ. 40 వేలు మంజూరయ్యాయి. మంగళవారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, కౌన్సిలర్ బోయరవి, స్థానిక నేతలతో కలిసి లబ్దిదారులకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందన్నారు. అనారోగ్యంతో బాధపడే పేదలు తమ వైద్యం కోసం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరోవైపు కోట్ పల్లి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు మంజూరైన రూ. 52వేల ఎల్బీసీని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ రాము, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల నాయకులు శరణు భూపాల్, బిర్కడ్ రఘు, సిద్ధు తదితరులు ఉన్నారు.

