బల్దియాలో దశాబ్ది శోభ..!
– విద్యుత్ కాంతుల్లో కార్యాలయం ముస్తాబు
– అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవరణ దశాబ్ది ఉత్సవాల శోభ సంతరించుకుంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంను పురస్కరించుకుని కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. జాతీయ జెండా రంగుల్లోని విద్యుత్ దీపాలను కార్యాలయానికి అలంకరణ చేశారు. మువ్వన్నెల విద్యుత్ కాంతుల్లో కార్యాలయం జిగేల్ మనిపించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కమీషనర్ శంకర్ సింగ్ ఆధ్వర్యంలో కార్యాలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వేడులకు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, ఫ్లోర్ లీడర్లు, కౌన్సిలర్లు, అధికారులతో పాటు స్థానిక నేతలు, సంఘాల నాయకులు, కార్మికులు తప్పక హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్
– రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం
– గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం
https://dharshininews.com/17490


